ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫ్రంట్ లైన్ వారియర్స్​ను వేధింపులకు గురిచేయడం బాధాకరం' - ఫ్రంట్ లైన్ వారియర్స్ ను వేధింపులకు గురిచేయడం బాధాకరం

కరోనా విపత్తులో విధులు నిర్వర్తించిన వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగాలు తొలగించి మాటతప్పిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను వేధింపులకు గురిచేయడం బాధాకరమన్నారు.

TDP Achenna
TDP Achenna

By

Published : Mar 22, 2021, 11:57 AM IST

కొవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వారిని ఉన్నపణంగా ఉద్యోగాల నుంచి తీసేస్తే వారెలా బ్రతకాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్న సిబ్బందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాత్సారం చేయడం తగదని సూచించారు. గుంటూరులో ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

కరోనా విధుల కోసం తీసుకున్న 10వేల మంది పారామెడికల్ సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఆరు నెలలుగా వారికి జీతాలు ఇవ్వకపోగా విధుల్లోంచి తొలగించారని దుయ్యబట్టారు. కరోనా విధుల్లో మృతి చెందిన వారియర్స్ కుటుంబాలకు 50 లక్షల బీమా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించడం దారుణమని ధ్వజమెత్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details