ఉన్మాదంతోనే తెదేపాపై ఆమంచి కృష్ణమోహన్ విమర్శలు చేస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాలో ఉన్నప్పుడే జగన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తల్లి లాంటి పార్టీకి ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఆమంచిని ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదన్నారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైకాపాపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని గ్రహించిన నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
'జగన్తో.. ఆమంచి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి పార్టీకి ద్రోహం చేశారు' - nimmala ramanaidu comments on amanchi krishnamohan
పార్టీలు మారడం ఆమంచి కృష్ణమోహన్ నైజమని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెదేపాలో ఉన్నప్పడే జగన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పార్టీకి ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. అభద్రతా భావంలో ఉన్న ఆమంచి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఆమంచి మాటలపై స్పందించిన టీడీఎల్పీ నేత నిమ్మల రామానాయుడు