ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిశ్రమ నెలకొల్పేందుకు సమస్యలున్నాయి... పరిష్కరించండి - గౌతంరెడ్డి టీసీఎల్ ప్రతినిధులు వార్తలు

రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నామనీ... వాటిని పరిష్కరించాలని చైనాకు చెందిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్​రెడ్డిని కోరారు. భూమి, నీరు, విద్యుత్తు, రవాణా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మంత్రి గౌతంరెడ్డితో టీసీఎల్ ప్రతినిధుల భేటీ

By

Published : Nov 13, 2019, 7:43 PM IST

మంత్రి గౌతమ్​రెడ్డితో టీసీఎల్ ప్రతినిధులు

రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నామనీ... వీలైనంత త్వరగా పరిష్కరించాలని చైనా సంస్థ టీసీఎల్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డిని కోరారు. సచివాలయంలో మంత్రితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూమి, నీరు, విద్యుత్తు, రవాణా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తే... తమ సంస్థ దశల వారీగా చేపట్టబోయే కంపెనీ పనుల గురించి గౌతమ్​రెడ్డికి వివరించారు. ఉద్యోగ కల్పన సహా... ఇతర అంశాలపై సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని గౌతమ్​రెడ్డి హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details