ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Russia Ukraine War: 'ఇప్పటివరకు 423 మంది ఏపీ విద్యార్థుల వివరాలు తెలిశాయి' - Task Force Committee Chairman Krishna Babu

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని టాస్క్​ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అందిన సమాచారం ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Task Force Committee Chairman Krishna Babu
Task Force Committee Chairman Krishna Babu

By

Published : Feb 26, 2022, 1:36 PM IST

Updated : Feb 26, 2022, 5:21 PM IST

Russia Ukraine War: 'ఇప్పటివరకు 423 మంది ఏపీ విద్యార్థుల వివరాలు తెలిశాయి'

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని టాస్క్​ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామని చెప్పారు.

ఉక్రెయిన్‌ నుంచి 23 మంది విద్యార్థులు వస్తున్నారు. రెండు విమానాల్లో ముంబయి, దిల్లీకి వస్తున్నారు. సాయంత్రం 6 గం.కు విమానం ముంబయికి వస్తుంది. రేపు ఉదయం 2 గం.కు మరో విమానం దిల్లీకి వస్తోంది. 23 మందిలో ఏపీ విద్యార్థులు ఎందరు ఉన్నారో స్పష్టత లేదు. ముంబయిలో ఐఆర్‌ఎస్ అధికారి రామకృష్ణ, దిల్లీలో దిగేవారికి ప్రవీణ్ ప్రకాష్ అండగా ఉంటారు. దిల్లీ, ముంబయి నుంచి విద్యార్థులను ఏపీకి తరలిస్తారు - కృష్ణబాబు, టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌

సాహసం చేసి సరిహద్దు ప్రాంతాలకు వస్తే ఇబ్బంది పడతారని కృష్ణబాబు హెచ్చరించారు. విద్యార్థులున్న ప్రాంతాల్లో బాంబింగ్, షెల్లింగ్ జరగడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకులు, దుకాణాల వద్ద ఇబ్బందులు రావొచ్చని తెలిపారు. ఉక్రెయిన్‌లో రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థల సేవలు అందిస్తున్నాయన్నారు.

'ఉక్రెయిన్‌లోని 7 వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల సమీపంలోని రొమేనియన్ ఎంబసీని సంప్రదిస్తున్నాం. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్‌లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్‌లో ఉన్నారనే వివరాలు రాబడుతున్నాం. వీసా స్టాపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచార సేకరణ చేపట్టాం' -కృష్ణబాబు, టాస్క్​ఫోర్స్ కమిటీ ఛైర్మన్

సమాచారం లేకుండా సరిహద్దులకు వెళ్లొద్దు..
Ukraine indian embassy: అధికారులతో సమన్వయం లేకుండా బోర్డర్ పోస్టుల వద్దకు వెళ్లవద్దంటూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం సూచించింది. కీవ్ సహా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా దాడులు పెరుగుతున్న వేళ ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నూతన అడ్వైజరీని జారీ చేసింది. సరిహద్దు పాయింట్ల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. ముందస్తు సమాచారం లేకుండా వెళ్తే సాయం చేయడం కష్టమని పేర్కొంది. ఉక్రెయిన్‌ పశ్చిమ నగరాల్లో వసతులు ఉన్నచోట ఉండటం సురక్షితమని సూచించింది. పరిస్థితిని తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు వెళ్లవద్దని పేర్కొంది.

తూర్పు ఉక్రెయిన్‌లో తదుపరి సూచనలు చేసేవరకూ ఇళ్లల్లోనే ఉండాలన్న రాయబార కార్యాలయం అన్ని వేళల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.

ఇదీ చదవండి

Last Updated : Feb 26, 2022, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details