ఐ కాంట్ బ్రీత్ నినాదంతో అమెరికాలో జాతి వివక్ష ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయుల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రెసిడెంట్ జయ శేఖర్ తాళ్లూరి అన్నారు. అమెరికన్ పోలీసుల చేతిలో అసువులు బాసిన జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన ఆయన... దీన్ని కేవలం కొంతమంది పోలీసుల కర్కశ చర్యగా చూడాలన్నారు.
'అమెరికా అల్లర్లతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు' - ఫ్లాయిడ్ నిరసనలు వార్తలు
ఐ కాంట్ బ్రీత్ నినాదంతో అమెరికాలో జరుగుతున్న జాతి వివక్ష ఉద్యమంపై ప్రవాస భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తానా ప్రెసిడెంట్ జయ శేఖర్ తాళ్లూరి అన్నారు. అల్లర్లను సద్దుమణిగించేందుకు అక్కడి ప్రభుత్వం... సైన్యం సహాయం తీసుకుంటుందని.... ఆందోళనల కారణంగా భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

Tana president respond on Usa Agitation I Can't Breathe
'అమెరికా అల్లర్లతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు'
ఐ కాంట్ బ్రీత్ నినాదంతో కొంతమంది దుండగలు కోవిడ్ కారణంగా మూసిఉన్న దుకాణాలను కొల్లగొడుతున్నారన్న ఆయన.. ఆ లూటీ ల్లో భారతీయులు కొంతమేర నష్టపోయారన్నారు. అల్లర్లను సద్దుమణిగించేందుకు అక్కడి ప్రభుత్వం... సైన్యం సహాయం తీసుకుంటుందన్న తానా ప్రెసిడెంట్... ఈ ఆందోళనల కారణంగా భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
ఇదీ చదవండి:ప్రతిధ్వని: అమెరికాలో ఆగ్రహ జ్వాలలపై చర్చ
TAGGED:
I Can't Breathe george news