ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM STALIN: మరోసారి మానవత్వం చాటుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌.. ఏం చేశారంటే! - తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌(CM MK STALIN) మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. కాన్వాయ్​ను పక్కకు ఆపి మరీ అంబులెన్స్‌కు దారి ఇచ్చి.. తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ ఘట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోసారి తన మానవత్వం చాటుకున్న సీఎం ఎంకే స్టాలిన్‌
మరోసారి తన మానవత్వం చాటుకున్న సీఎం ఎంకే స్టాలిన్‌

By

Published : Nov 1, 2021, 6:37 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(CM MK STALIN) తన గొప్పతనాన్ని చాటుకున్నారు. చెన్నైలో తన కాన్వాయ్​ వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్​ను గమనించారు స్టాలిన్​. తక్షణమే స్పందించి కాన్వాయ్​ను పక్కకు ఆపి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. సీఎంపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సీఎం స్టాలిన్(MK Stalin latest news).. తన భద్రతపై ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వెంట ప్రయాణించే కాన్వాయ్​లో (MK Stalin convoy) వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. తాను ప్రయాణించే సమయంలో ప్రజల వాహనాలను నిలిపివేసి వారికి ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు.

చెన్నై అడయార్ సమీపంలో ఉన్న శివాజీ గణేశన్ స్మారకాన్ని కొద్దిరోజుల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ (MK Stalin news) సందర్శించారు. ఈ సమయంలో అడయార్​కు వెళ్లే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 25 నిమిషాల పాటు వాహనాలను నిలిపివేశారు. ట్రాఫిక్​లో చిక్కుకుపోయిన వారిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనంత వెంకటేశన్ సైతం ఉన్నారు.

పోలీసుల ఆంక్షల కారణంగా ఆయన కోర్టుకు 25 నిమిషాలు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి.. న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే.. సీఎం కాన్వాయ్​లో (MK Stalin convoy) వాహనాల సంఖ్యను 14 నుంచి ఏడుకు తగ్గించారు.

ఇదీ చూడండి: 'ఎస్​బీఐ మాజీ ఛైర్మన్ భారీ మోసం.. రూ.200 కోట్ల ఆస్తిని...'

ABOUT THE AUTHOR

...view details