కోయంబత్తూరులో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోట్టీల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా కానిస్టేబుల్ సత్తా చాటారు. అత్యున్నత ప్రతిభ కనబరిచి ఎస్. చంద్రకళ ఏకంగా 4 బంగారు పతకాలను సాధించారు. మహిళ సీనియర్స్ విభాగంలో 76 కేజీల కేటగిరిలో.. 205 కేజీల బరువును ఎత్తి మెుదటి బంగారు పతకం సాధించింది. బెంచ్ ప్రెస్ విభాగంలో 107.5 కేజీలు.. డీడ్ లిఫ్ట్ విభాగంలో 212.5 కేజీల బరువును ఎత్తి వరుసగా రెండు, మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. ఈ మెుత్తం పోటీల్లో 525 కేజీల బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలువగా.. మరో బంగారు పతకాన్ని సాధించింది. విజయవాడకు చెందిన చంద్రకళ.. నిడమానూరు ఎక్సైజ్ డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సాధించిన అద్భుత విజయం పట్ల రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ సహా.. ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులు, కోచ్ అభినందనలు తెలిపారు.
ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర మహిళా కానిస్టేబుల్ ప్రతిభ - కానిస్టేబుల్ చంద్రకళ
ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోట్టీల్లో రాష్ట్ర మహిళా కానిస్టేబుల్ సత్తా చాటారు. విజయవాడకు చెందిన చంద్రకళ.. నిడమానూరు ఎక్సైజ్ డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె మెుత్తం పోటీల్లో 525 కేజీల బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు.
ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర మహిళా కానిస్టేబుల్ ప్రతిభ