గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని... మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు బాలసంజీవని, బాలామృతం వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
రక్తహీనతపై తగిన చర్యలు తీసుకొండి: సీఎస్ సాహ్ని - రక్తహీనతపై సీఎస్ సాహ్ని సమీక్ష వార్తలు
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు.
విటమిన్ ఎ, ఐఎఫ్ఏ, కాల్షియం మాత్రలు గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తీసుకునేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా మాతా, శిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 77 గిరిజన ప్రాంత మండలాల్లో అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి : మలయాళీ కవి అక్కితంను వరించిన జ్ఞాన్‌పీఠ్ అవార్డ్