రాష్ట్రంలో నాబార్డు సహాయంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులను డిసెంబర్‌లోగా ప్రారంభించాలని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.సెల్వ రాజ్ కోరారు. నిధులను సద్వినియోగం చేసుకునేలా అన్ని శాఖలు కృషి చేయాలన్నారు. సచివాలయంలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. నాబార్డు నుంచి సాయం పొందడంలో ఏపీ మిగతా రాష్ట్రాల కన్నా ముందుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వేల 250 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. పోలవరానికి 6వేల 381 కోట్లు రుణం మంజూరైతే ఇప్పటికే 5వేల 813 కోట్లు విడుదల చేసినట్లు నాబార్డు తెలిపింది. అలాగే రాష్ట్రంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్ట్‌లు, గ్రామీణ గోదాముల నిర్మాణానికి నాబార్డు రుణసాయం అందిస్తోంది.
'నాబార్డు నిధులు సద్వినియోగం చేసుకోండి' - నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.సెల్వ రాజ్
నాబార్డు నిధులను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.సెల్వ రాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులను డిసెంబర్‌లోగా ప్రారంభించాలన్నారు.
'నాబార్డు నిధులు సద్వినియోగం చేసుకోండి'