ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​తో తైవాన్ సంస్థల ప్రతినిధులు భేటీ - సీఎం జగన్ తాజా వార్తలు

తైవాన్​కు చెందిన పలు సంస్థల ప్రతినిధులు సీఎం జగన్​తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇచ్చిన ఆహ్వానంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్​లో పర్యటించాల్సిందిగా సీఎంను కోరారు.

cm jagan
cm jagan

By

Published : Nov 6, 2020, 9:41 PM IST

తైవాన్​కు చెందిన పలు సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను కలిశారు. తైపే ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌ వాంగ్‌, మంత్రి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సీఎం వారితో చెప్పారు.

పెట్టుబడుల కోసం తైవాన్‌కు సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బెన్‌ వాంగ్‌... తైవాన్‌ పర్యటకు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details