ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ఇద్దరి నుంచి ప్రాణహాని:. వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి - tadikonda mla sridevi field case against ycp leaders

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. సందీప్, సురేశ్ అనే ఇద్దరు వ్యక్తులపై తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ కొద్దిరోజుల కిందటే వైకాపా నుంచి సస్పెండ్ చేశామని.. అదే విషయాన్ని మనసులో ఉంచుకొని రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

tadikonda mla sridevi
tadikonda mla sridevi

By

Published : Nov 6, 2020, 10:45 PM IST

Updated : Nov 7, 2020, 8:01 AM IST

తాడికొండ నియోజకవర్గానికి చెందిన శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ, బెదిరిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘సందీప్‌, సురేష్‌ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో మండల పార్టీ నాయకులు వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. నేనే అధిష్ఠానానికి చెప్పానని భావించి, కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నా గొంతు మార్ఫింగ్‌ చేసి మాట్లాడుతూ నన్ను అవమానిస్తున్నారు. నేను బయటకు వెళ్లినప్పుడు వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

Last Updated : Nov 7, 2020, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details