సముద్రాన్ని ఈదాలనుకోవటం తప్పంటారు పెద్దలు. అయితే పట్టుదల ఉంటే అవలీలగా ఈదెయ్యెచ్చంటున్నారు మన తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల. 43 ఏళ్ల వయసులో రామసేతును ఈది రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన రెండో మహిళ మన హైదరాబాద్‌కి చెందిన శ్యామలే కావడం విశేషం.
తెలుగింటి ఆడపడుచు అరుదైన ఘనత.. రామసేతును ఈదిన రెండో మహిళ! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
సముద్రాన్ని ఈదడమా? అమ్మో అని భయపడతారు చాలామంది. సాగరాన్ని ఓ మహిళ ఈదడమంటే పెద్ద సాహసమనే చెప్పవచ్చు. ఆ సాహసాన్ని అవలీలగా ఛేదించారు తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల. కేవలం 13 గంటల్లో రామసేతును ఈదారు. ఈ ఘనత సాధించిన రెండో మహిళ హైదరాబాద్‌కు చెందిన శ్యామల కావడం విశేషం.
![తెలుగింటి ఆడపడుచు అరుదైన ఘనత.. రామసేతును ఈదిన రెండో మహిళ! shyamala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11201227-526-11201227-1617006198738.jpg)
శ్యామల
పాక్ జలసంధిగా పిలిచే రామసేతును ఈదటం అత్యంత కష్టమైందని.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ తెలిసినవారు స్నేహితులు వారించినా పట్టు వీడలేదు ఆమె. అనుకున్న లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ఇటీవలే పాక్ జలసంధిని కేవలం 13 గంటల 43 నిమిషాల్లో ఈదారు. ఈ నేపథ్యంలో గోలి శ్యామలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
గోలి శ్యామలతో ముఖాముఖి
ఇదీ చదవండి:ఈ మీనాల పేరు..టూనా!