Swearing ceremony of judges: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా జస్టిస్ కుంభాజడల మన్మథరావు, జస్టిస్ బొడ్డుపల్లి భానుమతిలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. ఇద్దరు న్యాయమూర్తులతో ప్రమాణ చేయించారు.
AP high court: హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ మన్మథరావు, జస్టిస్ భానుమతి ప్రమాణం - ఏపీ హైకోర్టు వార్తలు
Swearing ceremony of Judges: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కుంభాజడల మన్మథరావు, జస్టిస్ బొడ్డుపల్లి భానుమతిలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరయ్యారు.
![AP high court: హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ మన్మథరావు, జస్టిస్ భానుమతి ప్రమాణం AP high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13852287-291-13852287-1638964789071.jpg)
AP high court
ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరాం, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏ.రవీంద్ర బాబు, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకీరామి రెడ్డి,అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాధ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస రెడ్డి, రిజిష్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Chit Fund Fraud in Guntur: చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి..