ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ మణిచందన కన్నుమూత - swathi managing director died

స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ ఎం.మణిచందన గుండెపోటుతో చనిపోయారు. మణిచందన కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా గుండెపోటుతో మరణించారు.

swathi managing editor died
swathi managing editor died

By

Published : May 11, 2021, 7:19 AM IST

స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ ఎం.మణిచందన (48) కన్నుమూశారు. స్వాతి వార పత్రిక పబ్లిషర్‌, ఎడిటర్‌ వేమూరి బలరామ్‌కు మణిచందన ఒక్కరే కుమార్తె. ఆమె భర్త అనిల్‌కుమార్‌ ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మణిచందన కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details