ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద

రాష్ట్రంలో దేవాలయాలు.. రాజకీయ కబంధ హస్తాల నుంచి బయటికి రావాలని.. స్వామి పరిపూర్ణానంద అన్నారు. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆలయాల నిర్వహణలో విఫలమయ్యారని.. ఆయన్ను పదవి నుంచి తొలగించి మరేదైనా పని అప్పగించాలని వ్యాఖ్యానించారు.

paripoorna
paripoorna

By

Published : Sep 23, 2020, 2:26 PM IST

ప్రభుత్వం, అధికారులు దేవాలయాల జోలికి రావొద్దు: స్వామి పరిపూర్ణానంద

ఆలయాల విషయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు సరికాదని స్వామి పరిపూర్ణానంద అన్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల చరిత్ర ఏనాటిది..? నాని చరిత్ర ఏపాటిది..? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌ మౌనంతో... ఆయనే మాట్లాడిస్తున్నారనే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. తమ వాళ్లు ఇలాగే మాట్లాడతారంటే పునాదులు కదిలిపోతాయని హెచ్చరించారు.

ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి చాలా ప్రమాదం అని పరిపూర్ణానంద హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై మాట్లాడేందుకు మీకు ఏ హక్కుంది..? అంటూ కొడాలి నానిని ప్రశ్నించారు. 1810లో డిక్లరేషన్ పెట్టారని.. నానికి చట్టాలు, చరిత్ర తెలియదా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ దేవాలయాల జోలికి రావొద్దని పరిపూర్ణానంద సూచించారు. ఆలయాల నిర్వహణలో విఫలమైన దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు.. ఆ పదవి నుంచి తొలగించి మరేదైనా పని అప్పగించాలని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details