ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెరాస ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్‌ భర్త కుట్ర..! - ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర

MLA Jeevan Reddy: తెరాసకు చెందిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర జరిగింది. వన్‌రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

MLA Jeevan Reddy
తెరాస ఎమ్మెల్యే హత్యకు కుట్ర

By

Published : Aug 2, 2022, 1:15 PM IST

MLA Jeevan Reddy: తెరాసకు చెందిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం-12లోని ఆయన నివాసం వద్ద ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కిల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ ఈ హత్యకు కుట్రపన్నారు. జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి వద్ద కత్తి, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేసే విషయంలో ఎమ్మెల్యేపై ప్రసాద్‌గౌడ్‌ కక్ష పెంచుకున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details