ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్తారింటికి వెళ్లాడు.. అనుమానాస్పదంగా మృతి చెందాడు - వికారాబాద్​ నేరవార్తలు

భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు.. స్నేహితులు వస్తే.. వారితో బయటకు వెళ్లాడు. ఇక మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఒకరోజు గడిచాక.. అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. అసలేం జరిగింది?

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/12-September-2020/8772096_307_8772096_1599888627253.png
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/12-September-2020/8772096_307_8772096_1599888627253.png

By

Published : Sep 12, 2020, 10:53 PM IST

తెలంగాణ జిల్లా వికారాబాద్​ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్​ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతుడు ఎవరు..? మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మృతుడు వికారాబాద్​ జిల్లా రాకంచర్లకు చెందిన గోపాల్​గా (40) గుర్తించారు. రెండ్రోజుల క్రితం అత్తగారిల్లైన దిర్సంపల్లి తాండాకు తన భార్యతో కలిసి వెళ్లాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తానని చెప్పి వెళ్లిన గోపాల్​ ఒకరోజు దాటినా ఇంటికి రాలేదు. ఇవాళ ఉదయం గడిసింగాపూర్​ సమీపంలోని చింతలచెరువు దగ్గర అనుమానాస్పద స్థితిలో గోపాల్​ మృతదేహాన్ని స్థానికులు చూశారు. మృతుడి కాళ్లపై విద్యుత్​ తీగలు తగిలినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details