వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద జరిగిన రెక్కీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురామతో పాటు ఆయన భద్రతా సిబ్బంది చెబుతుండగా.. రోడ్డు పక్కన ఉన్న తనను కారులో బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాచెబుతున్నారు. ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
ఎంపీ రఘురామ భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
RRR Security Suspend: ఏపీ కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఇద్దరు భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ గంగారామ్, కానిస్టేబుల్ సందీప్ సస్పెండ్ అయ్యారు. ఎంపీ రఘురామకు భద్రతా సిబ్బందిగా వీరు ఉన్నారు.
రోడ్డుపక్కన ఉన్న కానిస్టేబుల్‌ను రఘురామ భద్రతా సిబ్బంది బలవంతంగా కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకు భద్రతగా ఉన్న సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ గంగారామ్‌తోపాటు కానిస్టేబుల్ సందీప్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, సీర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, సీఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ గంగారామ్, రఘురామ పీఏ శాస్త్రిలపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇవీ చదవండి