తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender) భూముల సర్వే(land survey) ఈరోజు నుంచి జరగనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మెదక్ జిల్లాలోని భూముల సర్వే(Etela land issues)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భూముల సర్వేకు రావాలంటూ ఈటల కుటుంబ సభ్యుల(notice to MLA Etela family)తో పాటు మరో 154మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈసర్వే నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనుంది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తమ భూములను ఈటల ఆక్రమించాడని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్(Etela rajender) హేచరీల(Jamuna Hatcheries)తో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు(Telangana High court)ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు.