ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా భయం: రేపు, ఎల్లుండి ఇంటింటి సర్వే

రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ అనుమానిత కేసుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వదేశానికి వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరించనున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో వైద్యశాఖ ‌అధికారులు సమీక్ష నిర్వహించారు. సరైన వివరాలు లేకపోవడం వల్ల ఇంటింటి సర్వే చేయాలని సర్కారు నిర్ణయించింది.

survey on carona in andhra pradesh
కరోనా భయం : రేపు, ఎల్లుండి ఇంటింటి సర్వే

By

Published : Mar 10, 2020, 3:53 PM IST

Updated : Mar 10, 2020, 8:03 PM IST

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల వివరాలను.. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా కార్యకర్తల ద్వారా సేకరించాలని వైద్యశాఖ నిర్ణయించింది. వీటిని గ్రామ, వార్డు సచివాలయ ‘మొబైల్‌ అప్లికేషన్‌’లో నమోదు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను ‘థర్మల్‌ స్కాన్‌’ ద్వారా పరీక్షిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ఆర్టీసీ బస్సుల్లో శుభ్రత పాటించాలని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జీ కమిషనర్‌ విజయరామరాజు అధికారులకు లేఖ రాశారు. రైళ్లలోనూ శుభ్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖ పంపారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్నందున ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేశారు.

Last Updated : Mar 10, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details