ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న వరద.. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తివేత - గోదావరి వరదలు

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేర నిండటంతో... అన్ని గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Prakasam Barrage
Prakasam Barrage

By

Published : Aug 21, 2020, 7:28 PM IST

ఎగువన మున్నేరు నుంచి వరద ప్రవాహాలు పెరగటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా పెద్ద మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. మున్నేరుకు 1 లక్షా 23 వేల 409 ఇన్ ఫ్లో వస్తుండటంతో అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీరు 37 వేల 448 క్యూసెక్కులుగా నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశమున్నందున డ్యామ్​ను ఖాళీ చేయించేలా.. అందుకు రెట్టింపు మొత్తంలో నీటిని దిగువకు విడుస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోని అన్ని గేట్లనూ ఎత్తి 86 వేల క్యూసెక్కులను నీటిని సముద్రంలోకి విడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 57 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details