హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి (Surabhi Vanidevi) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వాణీదేవితో ప్రమాణం శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
Surabhi Vanidevi: ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం
ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వాణీదేవితో శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందారు.
ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం
నువ్వానేనా? అన్నట్లుగా సాగిన హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానాన్ని అధికార పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి కైవసం చేసుకుంది. రెండు ప్రాధాన్యత ఓట్లతో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందారు.
ఇదీ చూడండి: LIBRARY: మాతృభాషలో ప్రతిభ.. 70 నుంచి 100 వరకూ పద్యాలు, శ్లోకాలు కంఠస్థం..