ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు - supreme on justice dharmadhikari report

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. తెలంగాణ విద్యుత్ సంస్థల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

supreme-key
supreme-key

By

Published : Dec 7, 2020, 1:03 PM IST

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను సవాల్​ చేస్తూ.. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు, పలువురు ఏపీ ఉద్యోగులు సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. 584 మందిని అదనంగా కేటాయించారని విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. విద్యుత్ సంస్థల అభ్యంతరాలను తోసిపుచ్చిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం .. సంబంధిత పిటిషన్​ను కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details