ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకాన్ని సవాలు చేస్తూ గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున కార్యదర్శి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరో నాలుగు వారాలు వాయిదా పడింది. పిటిషన్ వేసే సమయానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవిలో లేరని... ప్రస్తుతం ఆయన పదవిలో ఉన్నందున విచారణ కొనసాగడానికి కమిషనర్ అనుమతి తీసుకున్నారా అని గత విచారణలో ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బొబ్డే ధర్మాసనం ప్రశ్నించింది.
నిమ్మగడ్డ పునర్నియామకం పిటిషన్పై విచారణ 4 వారాలు వాయిదా - నిమ్మగడ్డ పునర్ నియామకంపై పిటిషన్ విచారణ వాయిదా
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకంపై దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున కార్యదర్శి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

నిమ్మగడ్డ పునర్నియామకం పిటిషన్ విచారణ 4 వారాలు వాయిదా
మంగళవారం విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రాలేదని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది లేఖ ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ నాలుగు వారాలకు వాయిదా వేయాలని కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఇదీ చదవండి :వస్తు, సేవల కొనుగోళ్లకు రివర్స్ టెండరింగ్ విధానం తప్పనిసరి