మూడు రాజధానుల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరగనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఎ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను... జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించనుంది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ ధర్మాసనాల ముందు విచారణకు వచ్చినా... పలు సాంకేతిక కారణాలలో వేరే ధర్మాసనానికి బదీలి చేశారు.
మూడు రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ - ఏపీ రాజధానులపై సుప్రీం విచారణ
మూడు రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మూడు రాజధానుల బిల్లులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
దీంతో ఇవాళ జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ముందుకు పిటిషన్ రానుంది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని అమరావతి జేఏసీ, రైతులు కేవియట్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి :రోడ్డు పక్కన పడుకున్న యాచకురాలిని చంపి.. ఆపై!