మార్చి, ఏప్రిల్‌లో ఏపీ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మార్చి, ఏప్రిల్‌లో 50 శాతం జీతాల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులు, పింఛనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో 2 నెలల్లో చెల్లించాలని హైకోర్టు ఆగస్టులో ఆదేశాలిచ్చింది.
వడ్డీతో జీతాలు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే - ఉద్యోగుల జీతాలపై ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
12 శాతం వడ్డీతో ఉద్యోగుల, పింఛనర్ల బకాయిలను చెల్లించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో 50 శాతం జీతాల చెల్లింపుపై ప్రభుత్వ జీవోలను ఆగస్టులో హైకోర్టు కొట్టివేసింది. 12 శాతం వడ్డీతో 2 నెలల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.

Supreme court
12 శాతం వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందున వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం...12 శాతం వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చారు.
ఇదీ చదవండి :తెలంగాణ అభ్యంతరాలపై స్పందించండి...ఏపీకి కృష్ణా బోర్డు లేఖ