మిషన్ బిల్డ్ ఏపీ అంశంపై సుప్రీం కోర్టులో.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. మిషన్ బిల్డ్ ఏపీ అంశంలో రిక్యుజల్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేయటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాలు చేస్తూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలపై... సుప్రీం కోర్టు స్టే - హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే అప్డేట్
బిల్డ్ ఏపీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై... సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
సుప్రీం కోర్టు స్టే