ఎన్జీటీ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం - NGT
14:27 October 17
నష్టపరిహారం అంశం మినహా అన్ని అంశాలు అమలు చేయాల్సిందేనన్న సుప్రీం
SUPREME ORDERS TO GOVT : పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన నష్టపరిహారం రూ.250 కోట్లు వెంటనే జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నష్టపరిహారం అంశం మినహా అన్ని అంశాలు అమలు చేయాల్సిందేనని తెలిపింది. రూ.250 కోట్ల నష్టపరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలు చేయాలని సూచించింది. పోలవం ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనపై ఎన్జీటీ కమిటీ జరిమానా విధించగా.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఎన్జీటీ కమిటీ సిఫార్సుల యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: