ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు - రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

గ్రామ సచివాలయ భవనాలకు రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకొంటారా అని ప్రశ్నించింది.

supreme court on ycp colours
supreme court on ycp colours

By

Published : Mar 23, 2020, 12:21 PM IST

గ్రామ సచివాలయ భవనాలకు రంగులు మార్చాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకొంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

ABOUT THE AUTHOR

...view details