ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణ! - ap govt field SLP in supreme court over local polls news

ap local elections
supreme court on ap local elections

By

Published : Jan 22, 2021, 8:47 PM IST

Updated : Jan 23, 2021, 3:05 AM IST

14:51 January 22

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం..... సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.... సవరించిన అనుబంధ జాబితాలో శుక్రవారం రాత్రి ఈ కేసును చేర్చింది. తొలుత 29న విచారణకొచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో చూపగా..... తర్వాత కొద్దిసేపటికే 25న విచారణకు రానున్నట్టు చూపారు. చివరకు సోమవారం నాటి అనుబంధ జాబితాలో చేర్చారు. పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగుమం చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చిన కొన్ని గంటలకే..... ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో 10 లోపాలున్నట్టు రిజిస్ట్రీ తెలియజేయగా... సవరించిన పిటిషన్‌ను న్యాయవాదులు దాఖలు చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం గురువారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల పిటిషన్​ను విచారించనుంది. 

అసలేం జరిగింది.. 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్​ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పు వెలువరించే క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  

 ఈ నెల 8న ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతం తెలిపింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు అనుమతిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపేందుకు సహేతుక కారణాలు లేవన్న హైకోర్టు.. రాజ్యాంగంలోని 9, 9‍(A) షెడ్యూల్ ప్రకారం కాలపరిమితిలోగా ఎన్నికలు తప్పనిసరని స్పష్టం చేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని తేల్చిచెప్పింది. ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం ఎస్ఈసీదేనన్న హైకోర్టు.. సీఈసీకి ఉన్న అధికారాలే ఎస్ఈసీకి ఉన్నాయని తెలిపింది.

సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఎస్ ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని సూచించింది. ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకువెళ్తారని చెప్పింది. వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా కోరడంలో సహేతుకత లేదంది. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికలు నిర్వహణ సబబేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అమెరికాతోపాటు మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ప్రభుత్వం....

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, టీకా కార్యక్రమం కొనసాగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈనెల 11న ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీలు చేయగా సీజే జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం 37 పేజీల తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 5.09 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

కేవియట్ దాఖలు చేసిన ఎస్​ఈసీ...

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్​కు ఎన్నికల కమిషన్ కేవియట్ వేసింది. సర్కార్​ వేసిన పిటిషన్​ను విచారించే సమయంలో తమ వాదనలు కూడా వినాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఎస్​ఈసీ కోరింది. ఆ తర్వాతే ఉత్తర్వులివ్వాలని పిటిషన్​లో అభ్యర్థించింది. ఈ మేరకు గురువారం కేవియట్​ పిటిషన్​ను ఎస్‌ఈసీ దాఖలు చేసింది. 

సంబంధిత కథనాలు:

అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలి: నిమ్మగడ్డ

Last Updated : Jan 23, 2021, 3:05 AM IST

ABOUT THE AUTHOR

...view details