'ఎస్ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ - నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీ గా పునర్ నియమిస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు
20:43 June 06
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం.. సుప్రీం కోర్టులో ఈనెల 10న విచారణకు రానుంది. వచ్చే బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం.. సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్, వర్ల రామయ్య, కామినేని శ్రీనివాస్, మస్తాన్ వలీ సహా పలువురు.. ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.