అమరావతి భూముల అంశంపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి5వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సిట్, కేబినెట్ సబ్‌కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదులు గడువు కోరారు. రెండువారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 5 కి వాయిదా వేసింది. అదేరోజు విచారణ ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మార్చి 5కు వాయిదా - అమరావతి భూముల వివరాలు
అమరావతి భూముల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సిట్, కేబినెట్ సబ్‌కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదులు గడువు కోరాగా.. తదుపరి విచారణను మార్చి 5 కు వాయిదా వేసింది ధర్మాసనం.
Supreme Court