గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. భూకేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని ఈ పిటిషన్ దాఖలైంది. నీటివనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్పై విచారణ.. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు నోటీసులు - ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు తాజా వార్తలు
గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. సీఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘిస్తూ తెదేపాకు భూమిని కేటాయించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
supreme court