మంత్రి ఆదిమూలపు సురేశ్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మంత్రి సురేశ్ దంపతులపై గతంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది సీబీఐ.
మంత్రి ఆదిమూలపు సురేశ్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం విచారణ - మంత్రి సురేశ్ అక్రమాస్తుల కేసు వార్తలు
![మంత్రి ఆదిమూలపు సురేశ్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం విచారణ disproportionate assets case against minister adimulapu suresh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13136689-1011-13136689-1632298080675.jpg)
disproportionate assets case against minister adimulapu suresh
13:15 September 22
disproportionate assets case against minister adimulapu suresh and his wife
విచారణ సందర్భంగా ఈ కేసులో ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది. క్షక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందని సురేశ్ దంపతులు తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి
Last Updated : Sep 22, 2021, 1:48 PM IST
TAGGED:
మంత్రి సురేశ్ తాజా వార్తలు