తన బెయిల్ షరతులను సడలించాలంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్యం ధర్మాసనం.. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్‌ను విచారించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని గాలి జనార్ధన్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం... రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
గాలి బెయిల్ షరతులపై విచారణ.. ఆరు వారాలకు వాయిదా - cbi cases in galli janardhan reddy
బెయిల్ షరతులపై మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు జనార్ధన్‌రెడ్డి తరపు న్యాయవాది సమయం కోరారు. అంగీకరించిన కోర్టు... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
![గాలి బెయిల్ షరతులపై విచారణ.. ఆరు వారాలకు వాయిదా supreme court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10130940-314-10130940-1609859345434.jpg)
supreme court