సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ జరిగింది. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. మరో ఆరు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. పదేపదే సమయమెందుకు కోరుతున్నారని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఇంకా ఎంతమందిని ప్రశ్నిస్తారని అడిగారు.
Disha case: 'ఇంకెంతకాలం..ఎంత మందిని ప్రశ్నిస్తారు'
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఎందుకు పదే పదే సమయం అడుగుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఇంకా ఎంతమందిని ప్రశ్నించాలని అడిగారు.
సుప్రీం కోర్టు
కొవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వొద్దని పిటిషనర్ మణి ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు సమయమిస్తూ సుప్రీంకోర్టు కేసు విచారణను వాయిదా వేశారు.
ఇదీ చదవండి:SI RAPE ATTEMPT: ఎస్సై శ్రీనివాసరెడ్డిపై మహిళా ట్రైనీ ఎస్సై ఫిర్యాదు
Last Updated : Aug 3, 2021, 4:07 PM IST