ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ అజయ్ రోస్తగి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని జస్టిస్ ఖాన్ విల్కర్ తెలిపారు.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే - AB VENKATESWAR RAO latest news
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఈ విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం... 3వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
Supreme Court has
ఈ కేసులో ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఛార్జిషీట్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఛార్జిషీట్ ఇవ్వకుండా సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేశారని నిలదీసింది. ఛార్జిషీట్‌ను ఏబీ వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది.
ఇదీ చదవండి:రాజధాని భూ కొనుగోలు దర్యాప్తుపై హైకోర్టు స్టే యథాతథం: సుప్రీం