New Judges to Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు పన్నెండు మంది కొత్త న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదుల నుంచి ఏడుగురు.. న్యాయాధికారుల నుంచి ఐదుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదులు కె.సురేందర్, చాడ విజయ భాస్కర్ రెడ్డి, ఎస్.నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్, ఎన్. శ్రావణ్ కుమార్ వెంకట్‌ను హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. జిల్లా జడ్జీలు జి.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ. సంతోష్ రెడ్డి, డి.నాగార్జునను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. నూతన న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పూర్తయితే.. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేతో సహా 31కి చేరనుంది.
- కొలీజియం సిఫార్సు చేసిన ఏడుగురు న్యాయవాదులు...
- కాసోజు సురేందర్
- చాడ విజయ్ భాస్కర్‌రెడ్డి
- సూరేపల్లి నందా
- ముమ్మినేని సుధీర్ కుమార్
- జువ్వాడి శ్రీదేవి
- మీర్జా సైఫీయుల్లా బేగ్
- నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్
- ఐదుగురు న్యాయాధికారులు
- జి.అనుపమ చక్రవర్తి
- ఎం.జి. ప్రియదర్శిని
- సాంబశివరావు నాయుడు
- ఎ.సంతోష్‌రెడ్డి
- డి.నాగార్జున