తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం - విద్యుత్ ఉద్యోగుల విభజనలో ఏపీకి అన్యాయం
13:04 October 11
విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ
తెలుగురాష్ట్రాల్లోని విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఆదేశాలు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వంపై.. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆంధ్ర నుంచి వచ్చిన పలువురికి నియామక ఉత్తర్వులు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇది కోర్టు ధిక్కారమేనని, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదిక అమలు చేయాలని, ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. ఈ నెల 31 న ఈ అంశంపై మరోసారి సమీక్షిస్తామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇవీ చదవండి: