ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ల్యాంకో హిల్స్‌ భూములపై.. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు - Telangana news

Lanco Hills Lands: ల్యాంకో హిల్స్‌ నిర్మాణ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నిర్మాణాలు జరుగుతున్న 1654.32 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ల్యాంకో హిల్స్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు
ల్యాంకో హిల్స్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

By

Published : Feb 7, 2022, 7:56 PM IST

Lanco Hills Lands: హైదరాబాద్​ మణికొండలోని ల్యాంకోహిల్స్‌ నిర్మాణ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ల్యాంకోహిల్స్‌లో నిర్మాణాలు జరుగుతున్న 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా టీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2012 ఏప్రిల్‌ 3న వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు 156 పేజీల తీర్పును జస్టిస్‌ హేమంత్ గుప్తా బెంచ్‌ వెలువరించింది.

ఈనామ్‌ భూముల చెల్లింపులు పెండింగ్‌ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. భూముల స్వాధీనం విషయంలో వక్ఫ్‌బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని స్పష్టం చేసింది. వక్ఫ్‌ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని, సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.భూములు వక్ఫ్‌బోర్డువని తేలితే రూ.50 వేల కోట్లు కడతామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇదీ చదవండి:ఆర్థిక పరిస్ఖితి ఇంతకన్నా ఘోరంగా ఉన్నప్పుడే.. 43 శాతం ఫిట్​మెంట్ ఇచ్చాం : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details