ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదలకు ఆపన్నహస్తం - lock down news

లాక్‌డౌన్‌తో తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేదలు, రోజువారీ కూలీలకు ఆపన్నహస్తాలు సాయం అందిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమై నిత్యావసరాలు కొనుక్కోలేని వారికి... పలువురు దాతలు సాయం చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా, వ్యక్తిగత శుభ్రతను ప్రోత్సహించేందుకు... శానిటైజర్లు, మాస్కులు అందిస్తున్నారు.

support to poor in lock down time
పేదలకు ఆపన్నహస్తం

By

Published : Apr 5, 2020, 5:26 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో క్వారంటైన్‌ వార్డును పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి... అక్కడ చికిత్స పొంది స్వస్థలాలకు వెళుతున్న 74 మందికి మాస్కులు పంపిణీ చేశారు. పుల్లలచెరువులో గ్రామవలంటీర్లకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాస్కులు, శానిటైజర్లు అందించారు. రేషన్‌ దుకాణాలు తనిఖీ చేసిన అనంతరం... పేదలకు వివిధ రకాల కూరగాయాలు పంచిపెట్టారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో యువకులు ఏర్పాటుచేసిన మూగజీవాల దాణా పంపిణీ కార్యక్రమాన్ని... మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. రోడ్లపై ఆహారం లేక అలమటిస్తున్న పశువులకు దాణా అందిస్తున్న యువకులను అభినందించారు. సంఘటితంగా కరోనాను తరుముదామని పిలుపునిచ్చారు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... దక్షిణమోపుర్‌లో 17,50 కుటుంబాలకు 5 రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో పేదలకు... వైకాపా నేత సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి 13,50 కూరగాయల ప్యాకెట్లను అందించారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందికి... టీవీఎస్​ మోటారు వాహనాల సేవా సంస్థ ఆధ్వర్యాన గ్లౌజులు, మాస్క్‌లు, శానిటైజర్లు ఇచ్చారు.

కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్, తాళ్ళపాలెం, పెదపట్నంలో నిరాశ్రయులైన పేదలకు... వింగ్స్‌ ఔట్రీచ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పాతపాటి దేవదాసు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బందరు రూరల్ గ్రామాల్లో సచివాలయ, వైద్య, పోలీసు సిబ్బంది, వాలంటీర్లకు శానిటైజర్లు, మాస్కులు అందించారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి చెందిన అరజా లక్ష్మితులసి... చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రామాల్లోని పేదలకు 7 రోజులుగా కూరగాయలు అందిస్తున్నారు. 5 రకాల కూరగాయలు ఉన్న 5 కేజీల ప్యాకెట్లను... ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గుడివాడ మండలం లింగవరంలో దాదాపు 500 కుటుంబాలకు వైకాపా నేతలు ఐదురకాల కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన భూపతిరాజు వంశీకృష్ణంరాజు... గ్రామంలోని ప్రతి ఇంటికీ కూరగాయలు, శానిటైజర్లు అందేశారు.

కడప జిల్లా ఎర్రగుంట్ల మూడో వార్డులోని పేదలకు... గుత్తేదారు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీ శ్రీపాదరావు కూరగాయలు పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతపైనా అవగాహన కల్పించారు. కమలాపురం నిస్సి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సునీల్ దత్... చర్చి ఫాదర్లకు నెలకు సరిపడా బియ్యం, కూరగాయలు ఇచ్చారు. కమలాపురం పరిసర ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతపురం శివారులో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేదలకు... ఎన్​ఆర్​ఐ మిత్రబృందం నిత్యవసరాల పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకూ అండగా ఉంటామని తెలిపింది.

పేదలకు ఆపన్నహస్తం

ఇదీ చదవండి: రాష్ట్రంలో 192 కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details