ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు - దిశ తాజా సమాచారం

సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్​కౌంటర్​ చేయడంపై... రాష్ట్రవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, పోలీసుల చర్యపై ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం, మహిళలను గౌరవించకపోవడం కారణంగా... ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు
దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు

By

Published : Dec 6, 2019, 8:57 PM IST

Updated : Dec 7, 2019, 5:02 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్​కౌంటర్​ చేయడంపై... రాష్ట్రవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, పోలీసుల చర్యపై ఆనందం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని ముక్తకంఠంతో నినదించారు.

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు


తూర్పుగోదావరి జిల్లా
రాజమహేంద్రవరంలో విద్యార్థినులు పోలీసులను అభినందించారు. రాజమహేంద్రి కళాశాల విద్యార్థినులు ర్యాలీగా నగరంలోని 3వ టౌన్​ పోలీస్​స్టేషన్​ వద్దకు వచ్చి, సీఐ దుర్గాప్రసాద్​కు పుష్పాలు ఇచ్చి అభినందించారు.
పి.గన్నవరం నియోజకవర్గంలో స్థానికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రఘురాజు ఆధ్వర్యంలో బాణసంచాలు కాల్చారు. తెలంగాణ పోలీసులకు సెల్యూట్​ చేసి... విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

కృష్ణా జిల్లా
దిశ హత్యకేసు నిందితులను ఎన్​కౌంటర్​ చేయటంతో జిల్లాకు చెందిన పలువురు మహిళలు.. సైబరాబద్​ సీపీ సజ్జనార్​ను ప్రశంసించారు. మహిళలపై అత్యాచారం చేసిన నిందితులకు తక్షమమే శిక్ష పడేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను చిన్నప్పటి నుంచే సక్రమ మార్గంలో పెంచాలని కోరారు.

గుంటూరు జిల్లా
మహిళల్ని గౌరవించటం సామాజిక బాధ్యతగా భావించాలి, అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు అన్ని వర్గాలు ఏకమై అండగా నిలవాలని గుంటూరు యువత తమ అభిప్రాయాలు తెలిపారు. అమ్మాయిలు తప్పనిసరిగా స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలని అంటున్నారు.

నెల్లూరు జిల్లా

దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేయడంపై నెల్లూరులో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీబొమ్మ వద్ద వందలాది మంది విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. ఎన్​కౌంటర్​ పట్ల తెదేపా నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ.. మిఠాయిలు పంచారు.

ఏబీవీపీ గుడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్​ వద్ద 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఎన్​కౌంటర్​ చేసిన పోలీసులకు అభినందనలు తెలియజేశారు. అభయ, నిర్భయ ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు తరచూ జరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టాలంటే ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి ఘటనలు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేశారు.

అనంతపురం జిల్లా
దిశ అత్యాచార నిందితులను ఎన్​కౌంటర్​ చేయడంపై అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శుక్రవారం విద్యార్థి సంఘం నాయకులు హర్షంవ్యక్తం చేశారు. ర్యాలీ నిర్వహించి అనంతరం టపాసులు కాల్చారు. తెలంగాణ పోలీసుల వ్యవహారశైలిపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

'దిశ కేసులో ఎన్​కౌంటరే సరైన న్యాయం'

Last Updated : Dec 7, 2019, 5:02 AM IST

ABOUT THE AUTHOR

...view details