మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని.. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలన వైపు దృష్టి సారించాలన్నారు.
సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని సుజనాచౌదరి ప్రశ్నించారు.ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్ వంటివి ఒకేచోట ఉండాలని విభజన చట్టం సెక్షన్ 6లో చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందన్నారు.