ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​​లో వర్షం.. ఆహ్లాదంలో నగరవాసులు - Amaravati news

భానుడి ఉగ్రరూపంతో విలవిలలాడుతున్న భాగ్యనగర ప్రజలకు వర్షం కురవడం.. కాస్త ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో నగరవాసులు ఆహ్లాదం పొందారు.

rains at many areas of hyderabad city
హైదరాబాద్​​లో వర్షం.. ఆహ్లాదంలో నగరవాసులు

By

Published : May 4, 2021, 5:57 PM IST

మండే ఎండాకాలంలో ఒక్కసారిగా కురిసిన వర్షం భాగ్యనగరవాసులకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది. కొన్ని రోజులుగా ఎండలు విజృంభిస్తున్న తరుణంలో కాసేపు వాతావరణం చల్లబడి వర్షం పడటం వల్ల నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు.

సికింద్రాబాద్​లోని బోయిన్​పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, జేబీఎస్ ప్రాంతాల్లో అరగంటపాటు వర్షం కురిసింది. దిల్​సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్​ నగర్​లోనూ చిరుజల్లులతో కూడిన వాన పడింది. ఉక్కపోత మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు చల్లటి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగించింది.

ABOUT THE AUTHOR

...view details