ప్ర. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో లేదు. దీనికి ప్రత్యామ్నాయం లేదా?
జ. కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌కు ప్రత్యామ్నాయంగా మందుబిళ్ల రూపంలో ఔషధం తయారీకి అమెరికా సంస్థ మెర్క్ ఒక ఫార్ములా రూపొందించింది. దీనిని ఉపయోగించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ)-తిరువనంతపురం ఓ ఔషధాన్ని తయారు చేస్తోంది. దీనిని అతి తక్కువ ధరకు దేశం అంతటా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫేజ్ 2 పరిశోధన జరుగుతోంది. ఆ తరువాత దశ పరిశోధనలు పూర్తయి అమెరికా నుంచి అనుమతి లభిస్తే మూడు లేక ఆరు నెలల్లో ఈ మందు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్ర. గాలి నుంచి ఆక్సిజన్ సేకరించి అందించే వెంటిలేటర్ మాస్క్‌లపై దృష్టిపెట్టారు. ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది?
జ.గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి శుద్ధి చేసి రోగికి అందించే వెంటిలేటర్ల తయారీపై దెహ్రాదూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ సంస్థ, చంఢీగఢ్‌లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ కలిసి దృష్టిపెట్టాయి. ఈ ప్రయోగంలో ఐఐసీటీ కూడా భాగమైంది. నెల రోజుల్లో ఈ టెక్నాలజీ సిద్ధమవుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలానే రెడ్డీస్ పౌండేషన్ ఆర్థిక సహాయంతో సరికొత్త మాస్క్ టెక్నాలజీని రూపొందించాం. ఈ మాస్క్ మల్టీలేయర్‌గా ఉంటుంది. దీనిపై ప్రతేకంగా తయారు చేసిన కెమికల్ వాడాం. మాస్క్‌పై కరోనా వైరస్ పడితే ఈ కెమికల్ వెంటనే నాశనం చేస్తుంది. 90 సార్లు ఈ మాస్క్‌ను ఉతికి ఉపయోగించవచ్చు. వివిధ సంస్థలతో ఇలాంటివి లక్ష తయారుచేసి గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయించాం. ఏ సేవా సంస్థ ముందుకు వచ్చినా ఈ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్ర. వైద్యులకు తోడ్పాటుగా ఉండేందుకు సరికొత్త మాస్క్‌ల తయారీ ఎంతవరకు వచ్చింది?