ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ ప్రాజెక్టు.. రూ.3,307.07 కోట్లకు బిడ్​ ఖరారు​

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం తెరిచింది. రూ.3,307 కోట్లతో సుభాష్​ ప్రాజెక్టు లిమిటెడ్​ బిడ్​ దక్కించుకుంది.

రాయలసీమ ప్రాజెక్టు.. బిడ్​ దక్కించుకున్న సుభాష్​ ప్రాజెక్ట్స్​
రాయలసీమ ప్రాజెక్టు.. బిడ్​ దక్కించుకున్న సుభాష్​ ప్రాజెక్ట్స్​

By

Published : Aug 17, 2020, 8:02 PM IST

Updated : Aug 17, 2020, 8:29 PM IST

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను జలవనరుల శాఖ ఖరారు చేసింది. రివర్స్ ఆక్షన్ అనంతరం రూ.3,307.07 కోట్లకు బిడ్లను ఖరారు చేశారు. ఈమేరకు పశ్చిమబంగాల్​కు చెందిన ఎస్పీఎంఎల్ ఇన్​ఫ్రా లిమిటెడ్ కలిసి సుభాష్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిడ్​ను దక్కించుకుంది. ప్రభుత్వం పిలిచిన ధర కంటే 0.88 శాతం అధికంగా ఈ బిడ్ ఖరారైంది.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయంగా రూ.3278.18 కోట్లను జలవనరుల శాఖ నిర్ధరించింది. ఎన్​సీసీతో పాటు నవయుగ కన్​స్ట్రక్షన్స్ సంస్థలు ఈ బిడ్​ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. తొలుత రూ.3,340 కోట్లతో బిడ్ దాఖలైంది. రివర్స్ ఆక్షన్ అనంతరం రూ.3,307 కోట్లకు బిడ్​ ఖరారు చేసినట్లు జలవనరుల శాఖ స్పష్టం చేసింది. ఈ రివర్స్ ఆక్షన్​లో అంచనా వ్యయం కంటే నవయుగ 1.40 శాతం మేర మాత్రమే అధికంగా కోట్ చేసి రెండో బిడ్డరుగా నిలిచింది.

Last Updated : Aug 17, 2020, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details