ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో సలహాదారును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకు ఆర్థిక సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్‌ను నియమిస్తూ సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలిచ్చారు. నిధుల సమీకరణలో సీఎం సలహాదారుగా గార్గ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్ పని చేశారు. రెండేళ్ల పాటు సీఎం ఆర్థిక సలహాదారుగా సుభాష్ గార్గ్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఆర్థికశాఖలో మరో కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను బదిలీ చేస్తూ ప్రభుత్వం అదేశాలు ఇచ్చింది. నిధుల సమీకరణ, సంస్థాగత ఆర్ధిక వనరులు విభాగానికి ప్రత్యేక కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమించారు
సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం - విశ్రాంత ఐఏఎస్ సుభాష్ చంద్ర గార్గ్ న్యూస్
సీఎం సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. నిధుల సమీకరణలో గార్గ్‌కు బాధ్యతలు అప్పగించారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్రగార్గ్ పని చేశారు. రెండేళ్లపాటు సీఎం సలహాదారుగా గార్గ్ కొనసాగనున్నారు.
Subhash Chandra Garg appointed as cm jagan adivisior
TAGGED:
cm jagan new adivisior news