ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

meeting: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు ఉపసంఘం సమావేశం

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉప కమిటీ నేడు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ జరగనుంది.

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు ఉపసంఘం సమావేశం
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు ఉపసంఘం సమావేశం

By

Published : Feb 17, 2022, 3:07 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలపై ఏర్పాటైన ఉపసంఘం మొదటి సమావేశం నేడు జరగనుంది. దృశ్య మాధ్యమం ద్వారా ఉదయం 11 గంటలకు కమిటీ సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్న, అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ-ఎస్​ఎఫ్​సీ విభజన, ఏపీ జెన్​కోకు తెలంగాణ డిస్కంల నుంచి బకాయిలు, పన్నుల్లో వ్యత్యాసాల సవరణ, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలపై భేటీలో చర్చించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చదవండి:

తపాలా కార్యాలయం ఉద్యోగి చేతివాటం.. డిపాజిట్ దారులకు రూ.20 లక్షలు టోకరా!

ABOUT THE AUTHOR

...view details