రాజధాని నిర్మాణంపై సిఫారసులకు.. నిపుణులతో కమిటీ!
కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న నవ్యాంధ్ర రాజధాని వ్యవహారంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనుల సిఫారసుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
రాజధాని నిర్మాణం సహా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు.. విశ్రాంత ఐఏఎస్ జి.ఎన్.రావు కన్వీనర్‌గా... డా.మహావీర్, డా.అంజలీ మోహన్, ప్రొ.శివానంద స్వామి, విశ్రాంత ప్రొఫెసర్ రవీంద్రన్, అరుణాచలం సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ.. పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరద నీటి యాజమాన్యంపైనా సభ్యుడి ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. ఆరు వారాల్లో సిఫార్సులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.