ఏడేళ్లుగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడ్డారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం(city central library)లో జరిగిన జాబ్ మేళా(job mela in hyderabad 2021) కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ వాణిదేవిని నిరుద్యోగులు ముట్టడించారు. నగర కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాణీ దేవిని నిలదీయటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులను పోలీసులు శాంతింప చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా.. వాణీదేవిని ప్రశ్నల వర్షంతో నిలదీశారు. ఓ సందర్భంలో నిరుద్యోగులపై వాణీదేవి ఆసహనం వ్యక్తం చేశారు.
రాజీనామా ఎప్పుడు చేస్తారు...?
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసే విధంగా సీఎం కేసీఆర్పై ఒత్తిడి తీసుకురావాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీకై ముఖ్యమంత్రితో చర్చించి నోటిఫికేషన్ తీసుకురాని పక్షంలో రాజీనామా చేస్తారా..? అని నిరుద్యోగులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒప్పుకోని పక్షంలో ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని కోరారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను శాంతింపజేసేందుకు వాణీదేవి ప్రయత్నించారు. రాజీనామా అంశాన్ని ప్రస్తావించవద్దని సూచించారు. పట్టుదల మంచిదే కానీ.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగులు వెనక్కి తగ్గకపోవడంతో గ్రంథాలయం నుంచి వాణీదేవి వెళ్లిపోయారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా..